Thursday, November 14, 2024
Homeక్రైమ్పిడుగుపాటుకు ఇద్దరు బలి

పిడుగుపాటుకు ఇద్దరు బలి

ప్రాణాలు తీస్తున్న పిడుగు..
మొన్న ముగ్గురు.. నేడు ఇద్దరు
స్పాట్ వాయిస్, ఐనవోలు : హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని వెంకటాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది. మూడు రోజుల కిందట పిడుగు పడి ముగ్గురు మృతి చెందగా.. ఆదివారం సాయంత్రం పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఐనవోలు మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన యవతి దౌత్ బాజీ శ్రావణి (17), యువరైతు కూకట్ల రాజు(25) వ్యవసాయ క్షేత్రం వద్ద పనులు చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న క్రమంలో వారిపై పిడుగు పడగా, ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. . కాగా, సెలవులు కావడంతో శ్రావణి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిందని, లేకపోతే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదని కుటుంబసబ్యులు రోధిస్తున్నారు. ఇద్దరు మృతితో గ్రామంతో తీవ్ర విషాదం నెలకొంది

RELATED ARTICLES

Most Popular

Recent Comments