150 అడుగుల జాతీయ జెండా ఏర్పాటు
పరిశీలించిన మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య
స్పాట్ వాయిస్, కార్పొరేషన్ : భద్రకాళి బండ్ పై ఏర్పాటు చేస్తున్న 150 అడుగుల జాతీయ జెండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. జాతీయ జెండా కు సంబంధించి ఏర్పాట్లను బుధవారం సాయంత్రం కమిషనర్ ప్రావీణ్య, జీడబ్ల్యూ ఎంసీ ఇంజినీరింగ్ అధికారులతో క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. భద్రకాళి బండ్ పై సీ జోన్ లో కొనసాగుతున్న అభివృద్ధి, సుందరీకరణ పనులైన ల్యాండ్ స్కేపింగ్, గ్రాండ్ ఎంట్రెన్స్, ఎలక్ట్రికల్, టాయిలెట్, గ్రానైట్, గ్రీనరీ ఏర్పాట్లను పరిశీలించి, తగిన సూచనలు చేశారు. నిర్దిష్ట గడువులోగా, పనులన్నీ నాణ్యత తో చేయాలని ఇంజనీరింగ్ అధికారులు, గుత్తేదారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో బల్దియా ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సీ హెచ్ వో శ్రీనివాస్ రావు, ఈఈ సంజయ్ కుమార్, డీఈ రవి కుమార్, ఏఈలు, గుత్తేదారులు తదితరులు ఉన్నారు.
భద్రకాళి బండ్పై మువ్వెన్నెల రెపరెపలు
RELATED ARTICLES
Recent Comments