Thursday, January 23, 2025
Homeటాప్ స్టోరీస్తస్మాత్ జాగ్రత్త..

తస్మాత్ జాగ్రత్త..

మరో మూడు రోజులు ఎండలే..
19న రాష్ట్రానికి రానున్న రుతుపవనాలు
వర్షాల కోసం ఎదురు చూస్తున్న రైతులు
స్పాట్ వాయిస్, బ్యూరో: జూన్ 15వ తేదీ వచ్చినా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మరో మూడు రోజుల పాటు ఎండలుంటాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వీస్తాయని చెప్పింది. శుక్రవారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో గాలులు వీస్తాయని తెలిపింది. శనివారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాల్లో వడగాలు వీచే అవకాశాలున్నాయని వివరించింది.
మరింత ఆలస్యం..
ఈ నెల 11న ఏపీలోకి నైరుతి రుతుపనాలు ప్రవేశించాయి. 13, 14 తేదీల్లో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ నాగరత్న తెలిపారు. కానీ రుతుపవనాలు రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈనెల 19న తెలంగాణలోకి నైరుతి రుతుపనాలు ప్రవేశిస్తాయని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలకు మోకా, బిపర్‌జోయ్‌ తుపానులు ప్రతిబంధకాలుగా మారాయి. రుతుపవనాల ప్రవేశం నుంచి విస్తరణ వరకు అడుగడుగునా అడ్డుపడుతున్నాయి. ఫలితంగా వడగాల్పులు విజృంభిస్తున్నాయి. ఏపీలోకి శ్రీహరికోట, పుట్టపర్తి వరకూ విస్తరించిన నైరుతి రుతుపవనాలు అక్కడ నుంచి ముందుకు కదలడం లేదు. దీంతో ఎండలు, వడగాడ్పులతో రాష్ట్రం నిప్పులకొలిమిలా మారుతోంది. అడపాదడపా అక్కడక్కడా వర్షాలు కురిసినా రుతుపవనాలు విస్తరించకపోవడంతో వేడి వాతావరణం కొనసాగుతోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments