ముగ్గురు సజీవ దహనం..!
సికింద్రాబాద్ అగ్ని ప్రమాదంలో విషాదం..
రెండో అంతస్తులో మృతదేహాలు
వివరాలు వెల్లడించని అధికారులు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: అగ్ని ప్రమాదంలో గల్లంతైన ముగ్గురు యువకులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. వారంతా మంటల్లో కాలిపోయి ప్రాణాలు విడిచినట్లు సమాచారం. డ్రోన్ కెమెరాల్లో రికార్డైన విజువల్స్ ఆధారంగా బిల్డింగ్ వెనుక భాగంలో వారి డెడ్ బాడీలను అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న కలెక్టర్ అమయ్ కుమార్ పరిస్థితి సమీక్షిస్తున్నారు. బిల్డింగ్ లోపల ఇంకా మంటలు అదుపులోకి రాలేదని ఫైరింజన్ల సాయంతో ఆర్పే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. లోపలి నుంచి పొగ, వేడి వస్తుండటంతో ఎవరూ లోపలికి వెళ్లలేకపోతున్నారని కలెక్టర్ చెప్పారు. బిల్డింగ్ లోపల డెడ్ బాడీస్ ఉన్నాయో లేదో ఇప్పుడే చెప్పలేమని అన్నారు. వేడి పూర్తిగా తగ్గాక బిల్డింగ్ ను కూల్చడంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అప్పటి వరకు పరిసర ప్రాంతాల వారిని అనుమతించబోమని స్పష్టం చేశారు.
విచారణ మొదలుపెట్టిన అధికారులు
సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఘటనాస్థలానికి వెళ్లిన జీహెచ్ఎంసీ అధికారులు బిల్డింగ్ ను పరిశీలిస్తున్నారు. అయితే పొగ దట్టంగా కమ్మేయడం, వేడి కారణంగా లోపలకు వెళ్లడం కష్టంగా మారింది. బిల్డింగ్ లో ఐరన్ ర్యాక్ లు ఏర్పాటు చేసి టాన్ల కొద్దీ బట్టలను నిల్వచేసినట్లు అధికారులు గుర్తించారు. ఫ్యాబ్రిక్ మెటీరియల్ కావడంతో మంటలు వేగంగా అంటుకుని ఉంటాయని అనుమానిస్తున్నారు. మరోవైపు గంటల తరబడి మంటలు కొనసాగడంతో బిల్డింగ్ పటిష్టతపై అనుమానాలు నెలకొన్నాయి. టెక్నికల్ టీం, స్ట్రక్చరల్ ఇంజినీర్స్ భవనాన్ని పరిశీలించిన అనంతరం కూల్చివేతపై నిర్ణయం తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన బిల్డింగ్ తో పాటు పక్క భవనాలను సైతం అధికారులు పరిశీలిస్తున్నారు.
ముగ్గురు సజీవ దహనం..!
RELATED ARTICLES
Recent Comments