Saturday, November 23, 2024
Homeవ్యవసాయం‘మోచా’ తుఫాన్‌ ముప్పు

‘మోచా’ తుఫాన్‌ ముప్పు

తెలంగాణకు భారీ వర్షాలు..
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈనెల 7వ తేదీన అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఇది సోమవారం వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉందని వివరించారు. ద్రోణి, ఉపరితల ఆవర్తనంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ‘మోచా’ తుఫాన్‌ ఏర్పడే అవకాశముందని, వీటి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. మోచా తుఫాన్‌ వల్ల తెలంగాణతో పాటు ఏపీ , ఒడిశారాష్ట్రాల్లో వర్షాలు పడతాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం వరకు పలు జిల్లాల్లో వానలు పడతాయని స్పష్టం చేసింది. శనివారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపా

RELATED ARTICLES

Most Popular

Recent Comments