Friday, September 20, 2024
Homeజనరల్ న్యూస్ఈ వారం... మీ రాశీఫలం

ఈ వారం… మీ రాశీఫలం

తేదీ : 29-05-2022 నుంచి 04-06-2022 వరకు...

* మేషం
నూతన గృహ నిర్మాణ యత్నాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు. సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.

* వృషభం
ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాహాది శుభ కార్యాల్లో పాల్గొంటారు. నూతన వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.

* మిథునం
ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగుపడతాయి. దీర్ఘకాలిక సమస్యల పెద్దల సహాయంతో పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి.

* కర్కాటకం
వృత్తి ఉద్యోగాల్లో చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. గృహ నిర్మాణ యత్నాల్లో అవాంతరాలు తప్పవు. వృత్తి వ్యాపారులకు సామాన్య లాభాలు అందుతాయి. నిరుద్యోగుల కష్టం వృథాగా మిగులుతుంది.

* సింహం
గృహ నిర్మాణ యత్నాలు ముందుకు సాగక ఇబ్బందులు కలుగుతాయి. నిరుద్యోగులకు అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. కొన్ని రంగాల వారికి కాంట్రాక్టులు చేజారి నిరుత్సాహం తప్పదు.

* కన్య
నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి. గృహ నిర్మాణయత్నాలు కలిసివస్తాయి.

* తుల
వృత్తి ఉద్యోగాల్లో అదనపు పని ఒత్తిడులు తగ్గే సూచనలు ఉన్నవి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అన్ని రంగాలవారికి కొత్త ఆశలు చిగురిస్తాయి.

* వృశ్చికం
ఇంటా బయట వివాదాలకు కొంత దూరంగా ఉండడం మంచిది. వ్యాపారాలు నత్తనడకగాసాగుతాయి. అన్నిరంగాల వారికీ అదనపు పని ఒత్తిడులు పెరుగుతాయి.

* ధనుస్సు
వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు నూతన సమస్యలు కలుగుతాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుతాయి.

* మకరం
వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో స్థానచలనాలు ఉంటాయి. కొన్ని రంగాల వారికి నిరుత్సాహం తప్పదు.

* కుంభం
వ్యాపారాల విస్తరణలో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారి అంచనాలు నిజం కాగలవు. వారం మధ్యలో స్వల్ప ధన,వ్యయ సూచనలు ఉన్నవి.

* మీనం
వృత్తి వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కొన్ని రంగాల వారికి కొత్త సమస్యలు కలుగుతాయి.

బ్రహ్మ శ్రీ డా. అవసరాల ప్రసాద్ శర్మ సిద్ధాంతి
చండి, ప్రత్యంగిరా, మహావిద్య ఉపాసకులు జ్యోతిష, వాస్తు నిపుణులు,

పంచాంగ కర్త, సిద్దాంతి
సెల్ నం. 9866077928

RELATED ARTICLES

Most Popular

Recent Comments