Friday, November 22, 2024
Homeక్రైమ్దొంగకు రిమాండ్

దొంగకు రిమాండ్

స్పాట్ వాయిస్, దామెర : దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని రిమాండ్ తరలించినట్లు దామెర ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా తొరంగి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ పెంకే ప్రకాష్.. (27) వృత్తి రిత్యా లారీ డ్రైవర్. అయితే జల్సాలకు అలవాటుపడిన సింకె పురాకీ దొంగతనాలు చేస్తుండేవాడు. 2009 లో కాకినాడలో సెల్ ఫోన్, రూ. 4 వేల నగదు ఎత్తుకెళ్లగా కాకినాడ పోలీసులు పట్టుకొని జైలుకు పంపించారు. ఏడాది క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలోని ఓ ఇంట్లో సెల్ ఫోన్ దొంగతనం చేశాడు. ఘట్ కేసర్ లో సెల్ ఫోన్ దొంగతనం చేసి అందులోని ఫోన్ యాప్ ద్వారా అకౌంట్లో ఉన్న రూ.1,70,000లను తన ఖాతాలోకి ట్రాన్ఫర్ చేసుకున్నాడు. ఈ కేసులో నాంపెల్లి సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకొని వలిగొండ పోలీసులకు అప్పగించగా, ఏడాది జైలు శిక్ష విదించారు. అనంతరం బయటకు వచ్చిన సింకె పురాకీ ఈ నెల 16వ తేదీన రాత్రి ఒంటి గంటకు ఆత్మకూరు మండలం కటాక్షపూర్ గ్రామం వద్ద రోడ్డు పక్కన తాళం వేసి బైక్ ను తీసుకుని తక్కళ్ళ పాడు గ్రామానికి వెళ్లి అక్కడ ఓ ఇంట్లో దొంగతనానికి ప్రయత్నించగా ఆ ఇంట్లో ఉన్నవారు చూసి కేకలు వేయగా సెల్ ఫోన్లు పడేసి, మోటర్ సైకిల్ పై అక్కడి నుంచి పారిపోయాడు. ఈ క్రమంలో తిరిగి దొంగతనం చేయడానికి వెళ్తుండగా దామెర పోలీస్ స్టేషన్ పరిధి ఒగ్లాపూర్ సైలానీ బాబా దర్గా సమీపంలో వాహన తనిఖీలు చేస్తుండగా  పెంకే ప్రకాష్ అనుమానాస్పదంగా పట్టుబడ్డాడు. అందుపులోకి తీసుకుని విచారించగా, పలు దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా, జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ సందర్భంగా ఎస్సై ముత్యం రాజేందర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానంతో దొంగలను వెంటనే పట్టుకుంటున్నామని, ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100 కు కానీ దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments