Monday, September 30, 2024
Homeలేటెస్ట్ న్యూస్నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు..

నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు..

మంత్రి కేటీఆర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్ : ‘మా అమ్మ నన్ను డాక్టర్గా చూడాలనుకున్నాదని’ మంత్రి కేటీఆర్ చెప్పారు. ప్రతి ఇంట్లో వారి పిల్లల్లో ఒకరైన డాక్టర్ కావాలని కోరుకుంటారని.. అలాగే నా తల్లి కూడా అలానే కోరుకున్నారని తెలిపారు. గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో నిర్వహించిన ఉమెన్ ఇన్ మెడిసిన్ కాన్క్లేవ్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. వైద్యరంగంలో భారత్ ఎంతో పురోగతి సాధించిందని చెప్పారు. వైద్యవృత్తి ఎంతో ఉన్నతమైనదని.. వైద్యవృత్తిలో మహిళలు రాణించడం గొప్ప విషయమన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తయారీలో మహిళల పాత్ర ఎంతో కీలకమని వెల్లడించారు. భారత్లో జెండర్ ఈక్వాలిటీని పాటించే కొన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాష్ట్రంలో మహిళ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి వీహబ్ ఏర్పాటు చేయడంతో పాటు తగిన ప్రోత్సాహం అందజేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని తెలిపారు. కొత్త టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉండాలని సీఎం కేసీఆర్ ఎప్పుడు అంటుంటారని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments