Saturday, April 5, 2025
Homeజాతీయంహస్తం... 6 వాగ్దానాలు ఇవే..

హస్తం… 6 వాగ్దానాలు ఇవే..

స్పాట్ వాయిస్, బ్యూరో: ఆదివారం సాయంత్రం తుక్కుగూడలో టి.కాంగ్రెస్ విజయభేరీ బహిరంగ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరవుతున్న సోనియా సభా ముఖంగా 6 వాగ్దానాలను ప్రకటించనున్నారు. 1. మహాలక్ష్మి 2. రైతు భరోసా 3. రాజీవ్ యువ వికాసం 4. అంబేద్కర్ అభయ హస్తం 5. చేయూత 6. మహిళా సాధికారత. వీటినే ప్రచార అస్త్రాలుగా చేసుకొని తెలంగాణలో అధికారం కోసం లడాయి చేయనున్నారు.

పథకాల వివరాలు..
మహాలక్ష్మి పథకం: 500 రూపాయలకే వంటగ్యాస్ సిలిండర్
రైతు భరోసా: ఏక కాలంలో 2లక్షల రైతు రుణమాఫీ
రాజీవ్ యువ వికాసం : మొదటి ఏడాదిలో 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
అంబేద్కర్ అభయ హస్తం: ఎస్సీ, ఎస్టీలకు రూ. 12 లక్షల ఆర్థిక సాయం
చేయూత- ఇందిరమ్మ ఇండ్ల కోసం రూ. 5 లక్షలు
మహిళా సాధికారత- బీపీఎల్ (దారిద్ర్యరేఖకు దిగువనున్న కుటుంబాలు) మహిళలకు నెలకు రూ. 3 వేల సాయం

RELATED ARTICLES

Most Popular

Recent Comments