పోలీసులు ఎదుట లొంగిపోయిన భార్య
వరంగల్ జిల్లాలో మర్డర్..
స్పాట్ వాయిస్, నర్సంపేట( దుగ్గొండి): క్షణికావేశంలో భర్త పై భార్య దాడి చేయగా భర్త మృతి చెందిన ఘటన నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. మండలంలోని మైనంపల్లి గ్రామానికి చెందిన జరిపోతుల రాజు గత కొంతకాలంగా మద్యానికి బానిసై ఇంట్లో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చిన రాజు భార్యతో గొడవపడగా విసుకు చెందిన భార్య భర్తపై ప్రతి దాడి చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో సిమెంట్ ఇటుకతో భర్త పై దాడి చేయగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతను శనివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
Recent Comments