Tuesday, June 3, 2025
Homeక్రైమ్పోలీస్ స్టేషన్ నుంచి దొంగ పరార్

పోలీస్ స్టేషన్ నుంచి దొంగ పరార్

పోతూపోతూ.. ఎస్కా్ర్ట్ పర్స్, ఫోన్ చోరీ..!
స్పాట్ వాయిస్, క్రైం: పోలీస్ స్టేషన్ నుంచి దొంగ పరారైన ఘటన వరంగల్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బైక్ చోరీ ఘటనలో రెండు రోజుల క్రితం నిందితుడిని కేయూ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం బాత్రూంకని వెళ్లి.. అటునుంచే అంటే పోలీసుల కళ్లు గప్పి దొంగ పారిపోయాడు. వెళ్తూ వెళ్తూ అతనికి ఎస్కార్ట్ గా ఉన్న కానిస్టేబుల్ పర్స్, సెల్ ఫోన్ ను సైతం పట్టుకెళ్లాడని సమాచారం. పోలీసులు దొంగ కోసం గాలింపు మొదలుపెట్టారు. దొంగ పారిపోయిన ఘటనపై సీపీ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments