Sunday, November 24, 2024
Homeజిల్లా వార్తలుఉప సర్పంచ్ పై అధికార పార్టీ సర్పంచ్ దాడి

ఉప సర్పంచ్ పై అధికార పార్టీ సర్పంచ్ దాడి

అవినీతిని ప్రశ్నించినందుకే అంటున్న బాధితుడు
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట : వర్ధన్నపేట మండలం కడారి గూడెం గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ప్రశ్నించినందుకు అధికార పార్టీకి చెందిన సర్పంచ్ సతీష్
తనపై దాడి చేశాడని బీజేపీకి చెందిన ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి ఆరోపించారు. ఆయన కథనం ప్రకారం.. మూడేళ్లుగా ఎన్ఆర్ఈజీఎస్ నిధుల లెక్కలు సరిగా లేకపోవడంతో వాటిని చూపించాలని సెక్రెటరీ, సర్పంచ్ ను ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని వాపోయారు. పనులు చేపట్టకుండా అడ్వాన్స్ రూపంలో కూడా గ్రామపంచాయతీ నిధులను సొంత పనులకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇటీవల ఈ లెక్కల గురించి ఆర్టీఐ ద్వారా కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం వల్లే దాడి చేశారన్నారు. గ్రామ పంచాయతీ నిధుల ఖర్చు గురించి సెక్రెటరీని చాలాసార్లు ప్రశ్నించినా సమాధానం ఇవ్వడం లేదని వార్డు మెంబర్లు కూడా ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ లో జరిగే ఖర్చుల వివరాలను ప్రతీ నెల నోటీస్ బోర్డుపై చూపించాల్సి ఉండగా వివరాలు తెలియజేయడం లేదని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments