ఆర్టీసీ అధికారులు వేధిస్తున్నారని ఆవేదన
ఆత్మహత్యాయత్నం సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్
వరంగల్ బస్టాండ్ లో కలకలం
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ బస్టాండ్ లో యువకుడి ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. బస్టాండ్ లో ఎస్.కె శభాజ్ క్యాంటిన్, బేకరీ, ఎలక్ర్టానిక్ గూడ్స్ విక్రయ సాపులు నిర్వహిస్తున్నాడు.ఆర్టీసీ అధికారులు తనను ఇబ్బంది పెడతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నెలనెల కిరాయి కడుతున్నా.. వేధిస్తున్నారని చెప్పాడు. అందుకే విషం తాగుతున్నట్లు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. శభాజ్ విషం తాగగానే బస్టాండ్ లో స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments