1.19 నిమిషాలకు ప్రకటన
స్పాట్ వాయిస్, హైదరాబాద్: కేసీఆర్ జాతీయ పార్టీకి ముహూర్తం ఖరారైంది. దసరా రోజున కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఫాం హౌస్ వేదికగా సీఎం కేసీఆర్ కసరత్తు పూర్తి చేశారు. అదేరోజు టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీల ఏకాభిప్రాయంతో ప్రకటన చేయనున్నారు. ఈ మేరకు త్వరలోనే భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేశారు. సభ వేదికగా.. పార్టీ పేరు ప్రకటించనున్నట్లు సమాచారం. దసరా రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు పార్టీ పేరు ప్రకటించి.. జెండా, ఎజెండా బహిరంగ సభలో ప్రకటించనున్నారు.
Recent Comments