స్పాట్ వాయిస్, గణపురం: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా రామకృష్ణాపురం చెందిన గడ్డం శ్రీను(47) ఆరు నెలలుగా జిల్లాలోని సింగరేణి 1000 క్వార్టర్స్ సమీపంలోని మాధవరావుపల్లి కాలనీలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ లో మేస్త్రీగా పని చేస్తున్నాడు. కాగా గురువారం మధ్యాహ్నం పని ప్రదేశంలో శ్రీను అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని ఎస్సై ఉదయ్ కిరణ్ చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Recent Comments