మొక్కజొన్న పంట రక్షణ కోసం కరెంటు కంచె..
స్పాట్ వాయిస్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. పంట పొలం రక్షణ కోసం ఏర్పాటు చేసిన వైర్లు తండ్రీకొడుకులను బలి తీసుకున్నాయి. వివరాల్లో కి వెళ్తే.. చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని దుమ్లా తండా కు చెందిన ఆంగోతు సీవీ నాయక్ (55) మూడెకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. పంటను కోతుల నుంచి రక్షించుకునేందుకు విద్యుత్ వైర్లు అమర్చారు. మంగళవారం తెల్లవారుజామున కోతుల కాపాలకు ఆంగోతు సీవీ నాయక్ కొడుకు కిరణ్(29)తో కలిసి కాపాలకు వెళ్లారు. ఈ క్రమంలో కిరణ్ ప్రమాదవశాత్తు కరెంటు వైరుపై పడిపోయాడు. కొడుకును రక్షించేందుకు సీవీ నాయక్ వెళ్లగా.. ఆయన సైతం కరెంటు షాక్ తో మృత్యువాత పడ్డాడు. కిరణ్ కు ఇద్దరు కుతూళ్లు, కొడుకు ఉన్నారు. తండ్రీకొడుకుల మరణంతో జిల్లా వ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
Recent Comments