Saturday, January 11, 2025
Homeక్రైమ్మాదన్నపేట చెరువులో పడిన కారు..

మాదన్నపేట చెరువులో పడిన కారు..

మాదన్నపేట చెరువులో పడిన కారు..
యువకుడు మృతి..మరో ఇద్దరు సేఫ్
స్పాట్ వాయిస్, నర్సంపేట టౌన్: నర్సంపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి వచ్చిన ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్లే.. మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేటకు చెందిన ముగ్గురు యువకులు నర్సంపేటలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగే వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కారులో నర్సంపేటలోని మాదన్న పేట చెరువు వైపు వెళ్లారు. ఈ క్రమంలో చెరువు మత్తడి వద్ద కారు అదుపు తప్పి చెరువులో పడిపోయినట్లు సమాచారం. గమనించిన స్థానికులు ఇద్దరిని కాపాడారు. మరో యువకుడి మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments