Tuesday, May 20, 2025
Homeలేటెస్ట్ న్యూస్అబ్బే.. అది పులి కాదు..

అబ్బే.. అది పులి కాదు..

అబ్బే.. అది పులి కాదు..
పాదముద్రలను పరిశీలించిన ఫారెస్ట్ అధికారులు
వీడియో వైరల్ పై క్లారిటీ..
స్పాట్ వాయిస్, రేగొండ: వామ్మో.. పొలాల్లో పులి అంటూ ఓ వీడియో ఉదయం నుంచి సోషల్ మీడియాలో తెగ తిరిగిస్తోంది. జయశంకర్ జిల్లా గోరుకొత్తపల్లి మండలం శివారులోని బొక్కిచెరువు సమీపంలో చిరుత పులి సంచరిస్తుందని పుకార్లు జోరుందుకున్నాయి. దీంతో మండలానికి చెందిన రైతులు భయాందోళనకు గురయ్యారు. కాగా మండల కేంద్రానికి చెందిన కొంతమంది రైతులు అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ములుగు, భూపాలపల్లి డివిజన్ ఫారెస్ట్ అధికారులు బొక్కి చెరువు సమీపంలోని ప్రాంతాన్ని పరిశీలించారు. వీడియోలో ఉన్నది అడవి జంగ పిల్ల అని గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. బొక్కి చెరువు సమీపంలో మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ పులి ఆకారంలో ఉండే జంతువును వీడియో తీసింది. అది కాస్త ఒకరి సెల్ నుంచి మరొకరి సెల్ కు చేరి సోషల్ మీడియాలో గోరికొత్తపల్లిలో పులి సంచరిస్తున్నట్లు వైరల్ అయింది. దీంతో అటవీశాఖ అధికారులు గురువారం ఉదయం బొక్కి చెరువు సమీపంలోని ఆ జంతువు తిరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఎక్కడ చూసినా పిల్లి పాదముద్రలే కనిపించడంతో వీడియో తీసిన మహిళతో మాట్లాడారు. ఆమె మాటల్లో పిల్లిని పోలిన ఆకారమే ఉందని చెప్పడంతో అధికారులు కూడా అది పిల్లేనని నిర్ధారించారు. మగ జాతికి చెందిన అడవి జంగ పిల్లి కొంచెం పెద్దగా ఉంటుందని భూపాలపల్లి ఫారెస్ట్ ఆఫీసర్ నరేష్, ములుగు డివిజన్ అటవీ శాఖ అధికారి శంకర్ తెలిపారు. వీడియోను జూమ్ చేసి తీయడం వల్ల ఇంకా పెద్దదిగా కనిపిస్తుందని తెలిపారు. ఎవరు భయాందోళనకు గురి కావద్దని రైతులకు ధైర్యం కల్పించారు. ఈ పరిశీలనలో సెక్షన్ ఆఫీసర్ గౌతమి, బీట్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments