Saturday, May 31, 2025
Homeజనరల్ న్యూస్విషమంగానే తారక్ హెల్త్..

విషమంగానే తారక్ హెల్త్..

విషమంగానే తారక్ హెల్త్..
గుండెలో ఎక్కువగా బ్లాక్స్

బెంగళూరు తరలింపు..

స్పాట్ వాయిస్,డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని కుప్పం నియోజకవర్గ కేంద్రం నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ శుక్రవారం ప్రారంభించిన పాదయాత్రలో సినీ నటుడు నందమూరి తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తారకరత్నను వెంటనే నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. అర్థరాత్రి వరకు బాలకృష్ణ కుప్పం ఆస్పత్రిలోనే ఉన్నారు. అయితే డాక్టర్లు చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తారకరత్నను బెంగళూరుకు తరలించారు. డాక్లర్ల బృందం అర్థరాత్రి ఒంటిగంటన్నర సమయంలోనే తారకరత్నను హుటాహుటిన బెంగళూరుకు తరలించింది. తెల్లవారు జామున రెండు గంటల నుంచి తారకరత్నకు ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు. డాక్టర్ ఉదయ్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం తారకరత్నకు చికిత్సనందిస్తోంది. నందమూరి తారకరత్న ఆరోగ్యపరిస్థితి కొంత విషమంగానే ఉందని, గుండెలో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం వల్లే ఆయనకు స్ట్రోక్‌ వచ్చిందని డాక్టర్లు చెబుతున్నారు. డాక్టర్లు ఆయనకు ఎలాంటి స్టంట్లు వేయలేదు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments