Sunday, April 20, 2025
Homeజిల్లా వార్తలుథాంక్స్ టు సిరికొండ

థాంక్స్ టు సిరికొండ

థాంక్స్ టు సిరికొండ

– భూపాలపల్లి బీసీ నాయకులు

-పార్టీ ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టిన ఎమ్మెల్సీ సిరికొండకు సన్మానం

స్పాట్ వాయిస్, గణపురం: కేంద్రంలో బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, బీసీ కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీలో తీర్మానం ప్రవేశపెట్టిన మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనాచారికి భూపాలపల్లి నియోజకవర్గ బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. శుక్రవారం సాయంత్రం భూపాలపల్లి నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారిని నియోజకవర్గం బీసీ నాయకులు శాలువాలు, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిరికొండ మధుసూదనాచారి మాట్లాడుతూ.. బీసీలపై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ ప్రదర్శిస్తోందన్నారు. 55 శాతానికి పైగా బీసీలు ఉన్న మనదేశంలో కేంద్ర ప్రభుత్వం బీసీ మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి బీసీలపై చిత్తశుద్ధి లేదని, అణగారిన బీసీ వర్గాల కోసం బీజేపీ ప్రభుత్వం ఎలాంటి కృషి చేయడం లేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం బడుగు బలహీనవర్గాలకు అండగా నిలుస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ బీసీల అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దబోయిన అనిల్, తీగల సంతోష్ , నీలలా వంశీ, తాళ్ళ శ్రీను, సురేందర్, జనార్దన్, మున్నా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments