Sunday, November 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్నో డిజిటల్ పేమెంట్..

నో డిజిటల్ పేమెంట్..

నో డిజిటల్ పేమెంట్..

వినియోగదారులకు షాక్ ఇచ్చిన టీజీఎస్పీడీసీఎల్

స్పాట్ వాయిస్, బ్యూరో:  తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీడీసీఎల్ ముఖ్య గమనిక చేసింది. ఇక నుంచి కరెంట్ బిల్లులు డిజిటల్ పేమెంట్ యాప్‌ల ద్వారా కట్టొద్దని.. కేవలం టీజీఎస్పీడీసీఎల్ వెబ్ సైట్ ద్వారా కానీ.. మొబైల్ యాప్ ద్వారా కానీ మాత్రమే చెల్లించాలని వినియోగదారులకు సూచించింది. ఆర్బీఐ ఆదేశాలకు మేరకు.. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే లాంటి యాప్‌లా ద్వారా బిల్లులు స్వీకరణ నిలిపేసినట్టు టీజీఎస్పీడీసీఎల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తున్న నేపథ్యంలో.. మొత్తం ఆన్‌లైన్‌లోనే పేమెంట్లు చేసేస్తున్నారు. ఇందుకు డిజిటల్ పేమెంట్ యాప్‌లు కూడా.. వినియోగదారులకు అనుకూలంగా పేమెంట్ ఆప్షన్లు ఇవ్వటమే కాకుండా.. ఎప్పటికప్పుడు మర్చిపోకుండా నోటిఫికేషన్లు ఇస్తూ బిల్లు కట్టే తేదీలను గుర్తు చేస్తుంటాయి. దీంతో.. ప్రజలు కూర్చున్న దగ్గరి నుంచి క్షణాల్లోనే కరెంట్ బిల్లుల దగ్గరి నుంచి అన్ని పేమెంట్లు చేసేస్తున్నారు.

నో డిజిటల్ పేమెంట్..

ఇక నుంచి కరెంట్ బిల్లులను డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా కట్టలేరంటూ.. షాక్ ఇచ్చింది టీజీఎస్పీడీసీఎల్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల మేరకు.. PhonePe, Paytm, Amazon Pay, Google Pay తో పాటు బ్యాంకుల యాప్‌లు, ఇతరత్రా యాప్‌ల ద్వారా విద్యుత్ బిల్లుల పేను నిలిపేస్తున్నట్టు టీజీఎస్పీడీసీఎల్ ప్రకటించింది. ఈ నిబంధన సోమవారం నుంచి అమలులో కి వచ్చింది. ఇక వినియోగదారులందరూ TGSPDCL వెబ్‌సైట్ లేదా.. TGSPDCL మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంట్ బిల్లును చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments