Sunday, September 22, 2024
Homeతెలంగాణవామ్మో బామ్మ..!

వామ్మో బామ్మ..!

బస్సు ఆపలేదని బీర్ బాటిల్ తో దాడి
ప్రశ్నిస్తున్నాడని డ్రైవర్ పై పామువేసింది..
మహానగరంలో షాకింగ్ ఘటన
స్పాట్ వాయిస్, డెస్క్: టీజీ ఆర్టీసీ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి అందరూ నివ్వెరపోయే ఘటన చోటు చేసుకుంది. అది ఎక్కడో మారుమూల గ్రామంలో కాదు.. విశ్వనగరంలోనే. హైదరాబాద్‌లోని నల్లకుంటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చెయ్యి ఎత్తిన బస్సు ఆపలేదన్న కోపం, మద్యం మత్తులో వృద్ధురాలు చిత్రవిచిత్రంగా ప్రవర్తించింది. మొదట బస్సుపై ఆ మహిళ బీర్ బాటిల్ విసిరేయడంతో అద్దం పగిలిపోయింది. దీంతో బస్సు వెనుక భాగంలోని అద్దం మొత్తం పగిలిపోయింది. అది గమనించిన డ్రైవర్ వెంటనే బస్సు ఆపాడు. తీవ్ర ఆగ్రహానికి గురైన డ్రైవర్ బీర్ బాటిల్‌తో కొట్టిన ఆ వృద్ధురాలిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఇక్కడే డ్రైవర్ కు షాకింగ్ ఘటన ఎదురైంది. తన దగ్గర ఉన్న పామును అతడిపై విసిరేసింది. దీంతో డ్రైవర్ అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అనంతరం డ్రైవర్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు నల్లకుంట పోలీసులు ఘటన స్థలానికి చేరుకోగా.. స్థానికులు ఆమెను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా డ్రైవర్‌ పైకి పాము విసిరిన పెద్దావిడ బ్యాగులో మరో 2 పాములు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అసలు ఆ వృద్ధురాలు ఎవరనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ ఘటనపై ఆర్టీసీ సైతం స్పందించింది. అకింతభావంతో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని కొందరు ఇలా భయభ్రాంతులకు గురిచేయడం దురదృష్టకరమని, ఈ తరహా ఘటనలను టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదని పేర్కొన్నారు. పోలీస్‌ శాఖ సహకారంతో బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments