Thursday, November 14, 2024
Homeతెలంగాణతెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ

త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి..

10 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం 

స్పాట్ వాయిస్ , బ్యూరో: తెలంగాణ గవర్నర్‌గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్‌ వర్మ (66)ను నియామకo అయ్యారు. శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వూలు జారీ చేశారు . ఏడుగురిని కొత్తగా నియమించగా, మరో ముగ్గురిని ఒక రాష్ట్రం నుంచి మరోరాష్ట్రానికి బదిలీ చేశారు.

రాజ కుటుంబం..

జిష్ణుదేవ్‌ వర్మ త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 సేవలందించారు. బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడిగానూ కొనసాగారు. జిష్ణుదేవ్‌ వర్మ త్రిపుర రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో బీజేపీలో చేరారు. తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్‌గా నియమితులుకాగా, ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తెలంగాణ గవర్నర్‌గా నియమించారు. ఝార్ఖండ్‌ గవర్నర్‌గా పని చేస్తన్న సీపీ రాధాకృష్ణన్‌ను ఇప్పటివరకూ తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనను తాజాగా కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న రమేష్‌ బైస్‌ను తప్పించింది. ఇక రాజస్థాన్‌ గవర్నర్‌గా మహారాష్ట్ర మాజీ స్పీకర్‌ హరిభావ్‌ కిషన్‌రావ్‌ బాగ్డేని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. ఈ స్థానంలో ఉన్న సీనియర్‌ నేత కల్‌రాజ్‌ మిశ్రాను తప్పించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments