Tuesday, September 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఫ్లాష్..ఫ్లాష్..

ఫ్లాష్..ఫ్లాష్..

టెట్ రిజల్ట్ విద్యాశాఖ క్లారిటీ..
ఫలితాలు ఎప్పుడంటే…?
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌-2022) ఫలితాల విడుదలపై రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. ఫలితాల్లో జాప్యం రాకుండా జూలై 1న విడుదల చేస్తామని వెల్లడించింది. ఈమేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, విద్యాశాఖ సంచాలకులు దేవసేన, ఎస్‌ఈఆర్‌టీ డైరెక్టర్‌ రాధారెడ్డి, ప్రభుత్వ పరీక్షల సంచాలకులు కృష్ణారావు తదితరులతో విద్యా శాఖ పనితీరును ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా జూలై 1న టెట్‌ ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments