Friday, November 22, 2024
Homeకెరీర్టెట్ ఫైనల్ కీ విడుదల

టెట్ ఫైనల్ కీ విడుదల

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టీఈటీ) ఫైనల్ కీ విడుదలైంది. బుధవారం టెట్ కన్వీనర్ రాధా రెడ్డి కీని విడుదల చేశారు. జూలై 1వ తేదీన టెట్ ఫలితాలను విద్యా శాఖ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జూన్ 27న ఫలితాలు విడుదల చేస్తామని తొలుత ప్రకటించారు. అయితే ఫలితాల విడుదల సమయం దగ్గరపడుతున్నా ఇంకా టెట్ ఫైనల్ కీ విడుదల కాలేదు. దీంతో ఒత్తిడికి గురవుతున్న టెట్ అభ్యర్థులు ఫైనల్ కీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఫలితాల విడుదల ఆలస్యం కానున్నట్లు టెట్ కన్వీనర్ ప్రకటించారు. జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించగా.. పేపర్ 1కు 3,18,506, పేపర్‌-2కు 2,51,070 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ నెల15న ప్రైమరీ కీ విడుదల చేశారు. ఇందులో పేపర్ 1లో 7,930, పేపర్ 2లో 4,663 అబ్జెక్షన్స్ వచ్చాయి. వీటిపై అధికారులు కసరత్తు చేశారు. ప్రస్తుతం ఫైనల్ కీ విడుదలైంది. ఫలితాల కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments