టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్
విద్యాశాఖ మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న ఎన్‌ఎస్‌యూఐ నాయకులు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: టెట్‌ను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ఆర్‌ఆర్‌బీ, టెట్ రెండు ఒకే రోజున ఉండడం వల్ల అభ్యర్థులు ఒకదానికి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంటుందన్నారు. ఉద్యోగం ఆశించే నిరుద్యోగులు… ఇందులో రెండింటికి హాజరు కావాలని భావిస్తున్నారని తెలిపారు. ఆర్‌ఆర్‌బీ అనేది జాతీయ స్థాయి పరీక్ష అని… దాన్ని వాయిదా వేయడం కుదరుదన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థాయి టెట్‌ను మరొక తేదీన నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగుల ఆశలను దృష్టిలో ఉంచుకుని తక్షణమే టెట్‌ను వాయిదా వేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే మీర్పేట్ రహదారిపై ఎన్ ఎస్ యూఐ నాయకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాన్వాయ్‌ని అడ్డుకున్నారు. టెట్ పరీక్షను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మీర్పేట్లో కార్యక్రమంలో మంత్రిని కలిసి వినతి పత్రాన్ని అందించేందుకు నాయకులు ప్రయత్నించగా.. ఆమె వెళ్లి పోయారు. దీంతో కాన్వాయ్కి అడ్డుపడ్డారు.
టెట్ వాయిదా వేయండి..
RELATED ARTICLES
Recent Comments