స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: తెలంగాణలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి ముందస్తుగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2022 నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల చేసింది. అయితే ఈసారి టెట్‌కు దరఖాస్తు చేసుకోవాలంటే 2015 డిసెంబరు 23 తర్వాత ఇంటర్ లేదా డిగ్రీ పూర్తిచేసిన వారు తప్పనిసరిగా 50 శాతం మార్కులతో పాస్ కావాలని విద్యాశాఖ నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధన ప్రకారం జనరల్ అభ్యర్థులకు ఇంటర్ లేదా డిగ్రీలో 50 శాతం మార్కులు కచ్చితంగా ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు మాత్రం 45 శాతం మార్కులు కలిగి ఉండాల్సి ఉంటుంది. అంటే పేపర్-1 రాసేవారికి ఇంటర్‌లో, పేపర్-2 రాసేవారికి డిగ్రీలో సాధించిన మార్కుల శాతాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. అంతకంటే తక్కువ మార్కులతో ఇంటర్/డిగ్రీలో మార్కలు సాధించిన వారు టెట్ రాయడానికి అనర్హులు. టెట్ జీవో 2015 డిసెంబరు 23న ఇవ్వడం, ఆ తర్వాత 2016 మే, 2017 జూలైలో టెట్ జరపడం వల్ల వాటికి హాజరయ్యే వారు జీవో కంటే ముందుగా పాసై ఉండటంతో ఈ షరతు వారికి వర్తించదు. జీవో విడుదల తర్వాత ఉత్తీర్ణులైనవారికి ఈ మేరకు మార్కుల నిబంధన విధించారు. అయితే 2015కు ముందు పాసైన వారికి మాత్రం జనరల్ అభ్యర్థులకు 45, ఇతరులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
హెల్ప్ లైన్
దరఖాస్తుల సమర్పణ మార్చి 26 నుంచి ప్రారంభమైంది. మొదటిరోజు 4 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు టెట్‌కార్యదర్శి రాధారెడ్డి తెలిపారు. ఏమైనా సమస్యలుంటే హెల్ప్‌లైన్ నంబర్లకు ఫోన్ చేయవచ్చని సూచించారు. అభ్యర్థుల సందేహాలు, సూచనల కోసం హెల్ప్ లైన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ హెల్ప్ లైన్ జూన్ 12 వరకు అందుబాటులో ఉండనున్నాయి. 040-23120340, 23120433, 8121010310, 8121010410 నంబర్లకు కాల్ చేసి సందేహాల నివృత్తి చేసుకోవచ్చు.
Recent Comments