పది పరీక్ష మొదటిరోజు ప్రశాంతం
స్పాట్ వాయిస్, గణపురం:మండలంలో పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు మధ్యాహ్నం 12.30 వరకు జరిగాయి. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు. మండలంలో రెండు సెంటర్లలో 360 మంది విద్యార్థులకు గాను 359 మంది హాజరు కాగా.. ఒకరు గైర్హాజరైనట్లు ఎంఈఓ ఊరుగొండ ఉప్పలయ్య తెలిపారు. మొదటి రోజు ఎలాంటి మాస్ కాపియింగ్ జరగకుండా స్థానిక ఎస్సై రేఖ అశోక్ పటిష్ట భద్రత ను ఏర్పాటు చేశారు.
Recent Comments