టెన్త్ పేపర్ లీక్ నిజమే..
రంగంలోకి సైబర్ క్రైమ్ టీమ్
సాయంత్రంలోగా నిందితులను పట్టుకుంటా..
వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్.
స్పాట్ వాయిస్, వరంగల్ : పదో తరగతి హిందీ పేపర్ లీకంది వాస్తవమేనని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనే పేపర్ లీకేజీ జరిగినట్లుగా ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఆధారాలు లభించలేదని అన్నారు. పేపర్ బయటకు వచ్చిన అంశంపై సైబర్ క్రైమ్ దర్యాప్తు కొనసాగుతోందని, సాయంత్రంకల్లా అసలు విషయం తేలుతుందని సీపీ స్పష్టం చేశారు. అయితే ఇన్విజిలేటర్లే చేసి ఉంటారన్న అనుమానాలను కూడా సీపీ వ్యక్తం చేశారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ పరీక్షా కేంద్రం నుంచే లీకేజీ వ్యవహారం జరిగినట్లుగా ప్రచారం జరుగుతోందని, ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. గతంలో టీవీ చానెల్లో పనిచేసిన ఓ రిపోర్టర్ నుంచి ముందుగా విద్యాశాఖ అధికారులకు సమాచారం అందిందని, అతనికి సమాచారం ఏ విధంగా వచ్చింది అనే దానిపై కూడా విచారణ జరుపుతున్నట్లుగా పేర్కొన్నారు. సాయంత్రంలోగా నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ఇతర జిల్లాల్లోనూ పేపర్లు సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లోనూ తిరుగుతున్నాయని తెలిపారు. ఈనేపథ్యంలోనే వరంగల్, హన్మకొండ జిల్లాల్లోనే పేపర్లు బయటకు వచ్చినట్లుగా ఆధారాల్లేవని అన్నారు. అయితే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు హన్మకొండ, వరంగల్ జిల్లాల డీఈవోలు సీపీని కలిసి ఫిర్యాదు చేశారని సమాచారం.
టెన్త్ పేపర్ లీక్ నిజమే..
RELATED ARTICLES
Recent Comments