ఉద్యోగం ఇవ్వడం లేదంటూ భూనిర్వాసితుడి ఆందోళన
పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం
పరిస్థితి విషమం..
స్పాట్ వాయిస్, గణపురం: మండలంలోని కేటీపీపీ ఎదుట ఉద్రిక్తత నెలకొంది. భూమి కోల్పోయి పదేళ్లవుతున్నా.. ఉద్యోగం ఇవ్వడం లేదంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చెల్పూర్ సమీప గ్రామమైన మహబూబ్ పల్లి గ్రామానికి చెందిన మర్రి లింగయ్య కేటీపీపీ మొదటి ఫేజ్ లో భూమి కోల్పోయాడు. ఆ సమయంలో ఆయన కుమారుడు మైనర్ కావడంతో ఉద్యోగం ఇవ్వలేదు. మేజర్ అయిన తర్వాత ఇద్దాస్తామని చెప్పిన అధికారులు ఆరేళ్లుగా తిప్పుకుంటున్నారు. రోజు వచ్చి వెళ్తున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో విసిగివేసారిన లింగయ్య శుక్రవారం పురుగుల మందు తెచ్చుకొని కేటీపీపీ గేటు ఎదుట తాగాడు. గమనించిన సెక్యూరిటీ సిబ్బంది అతడిని సింగరేణి ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషయమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ తరలిస్తున్నట్లు సమాచారం.
కేటీపీపీ వద్ద ఉద్రిక్తత.. పురుగుల మందుతాగిన నిర్వాసితుడు
RELATED ARTICLES
Recent Comments