Monday, April 7, 2025
Homeజనరల్ న్యూస్తెలంగాణ ఓటర్లు..2,99,92,941

తెలంగాణ ఓటర్లు..2,99,92,941

మహిళా.., పురుష ఓటర్లు ఎంతంటే..?

స్పాట్ వాయిస్, బ్యూరో: తెలంగాణ ఓట‌ర్ల ఫైనల్ లిస్టు వచ్చేసింది. రాష్ట్రంలో 2,99 ,92,941 మంది ఓట‌ర్లు ఉన్నట్లు ఎన్నిక‌ల సంఘం ప్రక‌టించింది. 1,50,48,250 మంది పురుష ఓట‌ర్లు ఉండ‌గా, 1,49,24,718 మంది మ‌హిళా ఓట‌ర్లు ఉన్నారు. హైద‌రాబాద్ జిల్లాలో మొత్తం ఓట‌ర్ల సంఖ్య 42,15,445, రంగారెడ్డి జిల్లాలో 31,08,068, మేడ్చల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో 25,24,951 మంది ఓట‌ర్లు ఉన్నారు. అత్యధికంగా శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో 6,44,072 మంది ఓట‌ర్లు ఉన్నారు. ఇక భ‌ద్రాచ‌లం 1,42,813 మందితో అత్యల్ప ఓట‌ర్లుగా ఉన్న నియోజ‌క‌వ‌ర్గంగా నిలిచింది. ఏటా ఓట‌ర్ల జాబితా స‌వ‌ర‌ణ త‌ర్వాత జ‌న‌వ‌రి నెల‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓట‌ర్ల జాబితాను ప్రక‌టిస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ గురువారం ఓట‌ర్ల జాబితాను విడుద‌ల చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments