వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: ప్రతీ గ్రామం, పట్టణంలో పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని వరంగల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతిలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామసభకు హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ సుధీర్ కుమార్ తో కలిసి అరూరి పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా సుమారు రూ.2.30 కోట్లతో నిర్మించిన రైతు వేదిక, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం కొండపర్తి నుంచి ఒంటిమామిడిపల్లికి ఏడుకోట్ల రూపాయలతో బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయని, సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం ప్రగతి దిశగా పయనిస్తుందని తెలిపారు. పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా పారిశుధ్యం, పచ్చదనం, మౌలిక సదుపాయల కల్పన, ఆరోగ్యం, విద్యుత్ తదితర సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
స్వచ్ఛ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు
RELATED ARTICLES
Recent Comments