Saturday, November 16, 2024
Homeలేటెస్ట్ న్యూస్కేయూలో తెలంగాణ ఉద్యమం

కేయూలో తెలంగాణ ఉద్యమం

రగులుతున్న ‘ప్రత్యేక‘ కాంక్ష
ఆంధ్ర ప్రొఫెసర్ కు రిజిస్ట్రార్ బాధ్యతలు ఇవ్వడంపై నిరసన
వెలిసిన ప్రత్యేక పోరు తరహా పోస్టర్లు
కేయూ వీసీ తీరుపై మండిపడుతున్న విద్యార్థులు, విద్యార్థి నాయకులు

స్పాట్ వాయిస్, కేయూ: కేయూలో మళ్లీ తెలంగాణ ఉద్యమం రగిలింది. అదేంటీ ప్రత్యేక రాష్ట్రంలోనే ఉన్నాం.. సాధించుకున్నామని అనుకుంటున్నారు కదు. కానీ కేయూలో గురువారం రాత్రి మళ్లీ ప్రత్యేక కాంక్ష నిప్పులు చెలరేగింది. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రా పెత్తనం ఏంటంటూ పోస్టర్లు వెలిశాయి. ప్రత్యేక రాష్ర్టం తెచ్చుకుంది మళ్లీ వలవాదులకు పెత్తనం ఇవ్వడానికా అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి. మళ్లీ ఉద్యమ గడ్డ ఓరుగల్లులోని కేయూలో ప్రత్యేక పోరు నినాదం, తిరుగుబాటు వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. కాకతీయ యూనివర్సిటీ ఇన్ చార్జ్ రిజిస్ట్రార్ గా దూరవిద్య కేంద్రంలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగం ప్రొఫెసర్ టి. శ్రీనివాస్ రావుకు బాధ్యతలు అప్పగించారు. రెగ్యులర్ రిజిస్ట్రార్ గా పని చేసిన బి. వెంట్రామ్ రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో శ్రీనివాస్ రావును నియమించారు. అయితే శ్రీనివాస్ రావుది ఆంధ్రా ప్రాంతమని, తెలంగాణకు చెందిన ప్రొఫెసర్లు లేరా అంటూ కేయూ విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. 2నెలల్లో పదవీ విరమణ చేయబోయే ప్రొఫెసర్ కు ఎలా రిజిస్ట్రార్ ఇస్తారని నిలదీస్తున్నారు. ఈ మేరకు కేయూ ప్రధాన గేట్లు, కాలేజీ, హాస్టల్ గోడలపై ఆయన నియమాకాన్ని నిరసిస్తూ పోస్టర్లు వెలిశాయి. ఆంధ్రా ప్రొఫెసర్ కు ఇన్ చార్జ్ రిజిస్ట్రార్ బాధ్యతలు ఇచ్చి తెలంగాణ బిడ్డలను అవమానించారంటూ కేయూ విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగాలతో ఏర్పడిన రాష్ర్టంలో ఆంధ్రపంతుల్లా ‘సిగ్గు..సిగ్గు’ అంటూ పోస్టర్లు అంటించారు. అంతేకాదు.. తెలంగాణ అమరవీరులను కించపర్చడం కేయూ వీసీ లక్ష్యమా అంటూ.., పదవికి తెలంగాణ ప్రొఫెసర్లు అర్హులు కాదా అంటూ వాల్ పోస్టర్లపై రాశారు. వెంటనే వీసీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొత్తంగా కేయూలో మళ్లీ తెలంగాణ ఉద్యమనాటి వేడి రగులుకుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ విషయమై.. ఓ ప్రొఫెసర్ తీవ్ర ఆవేదనకు అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ర్టంలో, ఉద్యమంలో కొట్లాడిన తెలంగాణ ప్రొఫెసర్లను విస్మరించడం బాధిస్తోందని ఆవేదనను వెల్లిబుచ్చాడు

RELATED ARTICLES

Most Popular

Recent Comments