Sunday, November 24, 2024
Homeతెలంగాణతెలంగాణ అప్పు రూ.3,12,191 కోట్లు

తెలంగాణ అప్పు రూ.3,12,191 కోట్లు

తెలంగాణ అప్పు రూ.3,12,191 కోట్లు
దేశంలో రాష్ర్టానికి 11వ ర్యాంక్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ అప్పుల్లో 11 ర్యాంక్ సాధించింది. దేశంలోని ఏయే రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయనే దానిపై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం బదులిచ్చింది. రాష్ట్రాలవారీగా అప్పుల జాబితాను కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసింది. మూడేళ్లలో రాష్ట్రాలు తీసుకున్న అప్పుల జాబితాను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రకటించారు. దీని ప్రకారం.. దేశంలో అత్యధికంగా అప్పులున్న రాష్ట్రాల జాబితాలో తొలి మూడు స్థానాల్లో తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఉన్నాయి. వీటి అప్పు సగటున రూ.6 లక్షల కోట్లకుపైనే ఉంది. ఎనిమిదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు రూ.3.98 లక్షల కోట్ల అప్పులు, 11వ స్థానంలో ఉన్న తెలంగాణకు రూ.3.12 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. 2022 వరకు ఏపీ అప్పులు రూ. 3 లక్షల 98 వేల కోట్లు ఉండగా.. తెలంగాణ అప్పులు రూ. 3 లక్షల 12వేల కోట్లుగా ఉంది. 2014 నాటికి తెలంగాణ అప్పు కేవలం రూ. 64వేల కోట్లు మాత్రమే ఉంది. అయితే 2014లో రూ.18 వేలుగా ఉన్న తలసరి అప్పు.. 2022లో రూ.లక్షకు పెరిగింది. వీటిపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందన్నారు. 8 ఏళ్లలో తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని కేసీఆర్‌ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. తెలంగాణలో అప్పులు చేసినా అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments