వ్యక్తి గత స్వార్థం కోసం కాదు ప్రజల కోసం పనిచేస్తాం..
ఒకటి రెండు పత్రికల ఆరోపణలు అర్ధ రహితం…
బీ ఎస్పీ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి..
సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్..
స్పాట్ వాయిస్, టేకుమట్ల: వ్యక్తిగత స్వార్థం కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తామని బీఎస్పి జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి,సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్ అన్నారు. ఈ సందర్బంగా వారు టేకుమట్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టేకుమట్ల మండలంలో, జిల్లాలో అనేక అక్రమ దందాలు మూడుపువ్వులు ఆరుకాయలుగా వెలుగొందుతున్నాయని, ఇన్ని అక్రమ దందాలను అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా అనేక పోరాటాలు చేస్తున్నామని, తద్వారా శాసనసభ్యులు, అధికారులు స్పందించి వాటిని అరికట్టుటకు అనేక చర్యలు తీసుకున్నారని,అందులో భాగంగానే కలికోట- ఓడేడు మానేరు పైన వంతెన నిర్మాణం చేయాలని, అక్రమ టోల్ టాక్స్ రద్దు చేయాలని అధికారులకు వినతి పత్రం అందజేశామని, కొన్ని పత్రికలు ఇట్టి దందాను గుర్తించి అరికట్టే విధంగా కథనాలు రాసారని, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, వారి కథనాల మూలంగా అధికారులు టోల్ టాక్స్ ను రద్దు చేశారని, అక్రమ వసూళ్లకు అలవాటు పడ్డ వ్యక్తులు రోడ్ ను జేసీబీ తో ధ్వంసం చేశారని, ఇంత తతంగం జరుగుతున్న ఒకటి రెండు పత్రికలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తులకు వత్తాసు పలికే విధంగా కథనాలు రాసారని,పత్రికలు ప్రజలకు వారధిలా ఉండాలని, ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చేరే విధంగా పనిచేయాలని ఇది జీర్ణించుకోలేని ఒకటి రెండు పత్రికలు వారి స్వార్థం కోసం అర్థ రహిత ఆరోపణలు చేస్తున్నాయని, మీరెన్ని అసత్య ఆరోపణలు,కథనాలు రాసిన అంతిమ విజయం ప్రజలదే అని, ఎల్లప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని, ప్రయాణికుల బాధలను అర్థం చేసుకుని వెంటనే రోడ్ గుంతలు పూడ్చి వేయించిన శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కసరవేణి. కుమార్ యాదవ్, BRS కార్మిక విభాగం మండల అధ్యక్షులు నేరెళ్ల రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Recent Comments