తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి
స్పాట్ వాయిస్, బ్యూరో : మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని క్యూ న్యూస్, శనార్థి తెలంగాణ ఆఫీస్ పై ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కొంత మంది వ్యక్తులు అకస్మాత్తుగా కార్యాలయంలోకి ప్రవేశించి ఆఫీసులోని కంప్యూటర్లు, క్యాబిన్లు, ఇతర ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. కార్యాలయంలోని వస్తువులను చిందరవందర చేసిన దుండగులు క్షణాల్లోనే అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. కార్యాలయానికి ఈ రోజు సెలవు కావడంతో సిబ్బంది కూడా చాలా తక్కువ మంది ఉన్నారని, దాడి సమయంలో మల్లన్న కూడా అక్కడ లేనట్లు తెలుస్తోంది. ఈ ఈ ఘటనపై కార్యాలయ సిబ్బంది, మల్లన్న టీమ్ సభ్యులు ఆందోళనకు దిగారు. దాడి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Comments