Sunday, September 22, 2024
Homeలేటెస్ట్ న్యూస్టీచర్లు ఆస్తుల లెక్క చెప్పాల్సిందే..

టీచర్లు ఆస్తుల లెక్క చెప్పాల్సిందే..

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ టీచర్లు ఆస్తుల వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఏటా ఉపాధ్యాయులు ఆస్తి వివరాలు సబ్మిట్ చేయాల్సిందేనని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. స్థిర, చర ఆస్తులు అమ్మినా.. కొన్నా ముందస్తు అనుమతి తీసుకోవాలని ఆదేశించారు. విద్యాశాఖలో పని చేస్తున్న ఉద్యోగులందరూ వార్షిక ప్రాపర్టీ స్టేట్ మెంట్ సమర్పించాలని సూచించింది. టీచర్లకు, ఉద్యోగులుకు ఇన్ స్ట్రక్షన్ ఇవ్వాలని ఆర్ జేడీలు, డీఈవోలకు ప్రభుత్వం శనివారం ఆదేశాలు జారీ చేసింది. ముందుగా అనుమతి తీసుకున్న తర్వాతే..స్థిర / చర ఆస్తులు కొనుగోలు / అమ్మకాలు చేయాలని ఉద్యోగులను ఆదేశించింది. ఇన్నేళ్లు ఉపాధ్యాయుల విషయంలో అంతగా పట్టించుకోని విద్యాశాఖ నల్గొండ జిల్లాలోని ఓ ఉపాధ్యాయుడి వ్యవహారంపై విజిలెన్సు శాఖ రిపోర్ట్ ఇవ్వడంతో నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments