Thursday, November 21, 2024
Homeజాతీయంపాఠం తప్పిన పంతుళ్లు..

పాఠం తప్పిన పంతుళ్లు..

ఎనిమిదేండ్ల జీతం వెనక్కియ్యాల్సిందే..
బెంగాల్ స్కూల్ రిక్రూట్‌మెంట్ కుంభకోణంలో కోల్ కత్తా హైకోర్టు సంచలన తీర్పు..
అడ్డంగా బుక్కైన 23,753 ఉద్యోగులు
12 శాతం వడ్డీతో సహా నాలుగు వారాల్లో చెల్లించాలని ఉత్తర్వులు..
మ‌మ‌తా స‌ర్కార్ కు షాక్

స్పాట్ వాయిస్, డెస్క్: పాపం.. పంతుళ్లు పాఠం తప్పారు. ఉద్యోగం చేస్తున్నాం., జీతమొస్తోంది.., జీవితాలు హాయిగా సాగిపోతున్నాయని సంతృప్తి పడుతున్న 23,753 మంది టీచర్లకు ఇవ్వాళ గుండెల్లో గుణపం దిగినట్టైంది. గ్రూప్‌- సీ, గ్రూప్‌- డీలో స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ చేసిన నియామకాలు చెల్లవ‌ని, 2016 నాటి మొత్తం ప్యానెల్‌ను రద్దు చేయాలని కోల్ కోత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలతో అంతా హతాశులయ్యారు. 9, 10, 11, 12వ తరగతుల్లో గ్రూప్‌- సీ, గ్రూప్‌- డీలో స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ చేసిన నియామకాలన్నీ చట్టవిరుద్ధమని ప్రకటించిన కోర్టు, 23753 మంది 2016 నుంచి తీసుకుంటున్న జీతాలు 12 శాతం వడ్డీతో నాలుగు వారాల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే జీరో పోస్టులపై కొత్త నియామకాలు ప్రారంభించాలని స్కూల్ సర్వీస్ కమిషన్‌ను కోల్ క‌తా హైకోర్టు ఆదేశించింది. దీనిపై సీబీఐ దర్యాప్తు కొనసాగించ‌వ‌చ్చని, కేసులో ఎవరినైనా కస్టడీలోకి తీసుకోవచ్చని పేర్కొంది. 23 లక్షల మంది అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను తిరిగి మూల్యాంకనం చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. రానున్న 15 రోజుల్లో కొత్త నియామకాలపై తగిన చర్యలు తీసుకోవాలని కోర్టు యంత్రాంగానికి తెలిపింది. హైకోర్టు సంచలన తీర్పుతో మమత సర్కార్ కు భారీ షాక్ తగిలింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments