స్పాట్ వాయిస్, జనగామ: స్టేషన్ ఘన్ పూర్ మండలం నమిలిగొండ గ్రామ పరిధి కస్తూర్బా విద్యాలయంలో పనిచేస్తున్న ఇంగ్లిష్టీచర్సబిత పై సంబంధిత శాఖ అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. సబిత పిల్లలతో పనులు చేయించుకోవడమే కాకుండా నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు అర్ధరాత్రి సమయంలో బయట తిరుగుతోందనే విషయాన్ని గ్రామస్తులు, విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల జిల్లా ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన అనంతరం సబితను సస్పెండ్చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాము శనివారం ప్రకటనలో ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా… విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శుక్ర,శనివారాల్లో టీచర్ పై చర్యలు తీసుకోవాలని ధర్నా చేశారు.
Recent Comments