స్పాట్ వాయిస్, బ్యూరో: విద్యార్థులు ఉపాధ్యాయుడి నీ కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. రాయచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో పని చేస్తున్న ఏజాస్ అనే ఉపాధ్యాయుడిని 9వ తరగతి విద్యార్థులు క్లాస్ రూమ్ లోనే కొట్టి చంపేశారు. అయితే విద్యార్థులు అల్లరి చేయడంతో ఏజాస్ మందలించారు.. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు ఒక్కసారిగా ఉపాధ్యాయుడిపై దాడి చేశారు.చాతిపై కొట్టడంతో ఏజాస్ క్లాస్ రూమ్ లోనే సొమ్మసిల్లి పడిపోయారు.. ఏజాస్‌ను తోటి ఉపాధ్యయులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ టీచర్ ఏజాస్ మృతి చెందారు.. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Recent Comments