హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లిన నందమూరి ఫ్యామిలీ
స్పాట్ వాయిస్, బ్యూరో: గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ సహా ఇతర కుటుంబ సభ్యులు తారకరత్నను చూసేందుకు శనివారం బెంగళూర్ వెళ్లారు. 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తారకరత్న చికిత్స పొందుతున్నారు. కాసేపట్లో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. జనవరి 27న నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. వెంటనే కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆస్ఫత్రికి తరలించారు. తర్వాత మెరుగైన ట్రీట్ మెంట్ కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి తారకరత్నకు ట్రీట్ మెంట్ కొనసాగుతోంది.
అత్యంత విషమంగా తారక్ ఆరోగ్య పరిస్థితి..
RELATED ARTICLES
Recent Comments