Saturday, November 23, 2024
Homeకెరీర్గుడ్ న్యూస్.. టీ శాట్ లో టెట్ క్లాసులు

గుడ్ న్యూస్.. టీ శాట్ లో టెట్ క్లాసులు

స్పాట్ వాయిస్,ఎడ్యుకేషన్: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం విడుదల చేస్తున్న ఉద్యోగ నోటిఫికేషన్లలో గెలుపు బాటలు వేసేందుకు టీశాట్ సిద్ధమవుతోంది. ముందు కొచ్చింది. టెలిపాఠాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురానున్నది. గ్రూప్‌-1, టెట్‌, టీచర్‌ పోస్టులు, పోలీసు, వైద్యారోగ్యశాఖలోని పలు పోస్టులకు పోటీపడుతున్న వారికి ఉచిత శిక్షణనిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఏప్రిల్‌ 4 నుంచి ఈ శిక్షణ ప్రారంభంకానున్నది. ప్రస్తుతానికి టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌)కు ఏప్రిల్‌ 4 నుంచి జూన్ 4 వరకు మొత్తం 60 రోజుల పాటు 102 ఎపిసోడ్ల ద్వారా శిక్షణనివ్వనునున్నారు. ఉదయం, మధ్యాహ్నం ఒక్కో సబ్జెక్టుకు 30 నిమిషాల పాటు పాఠ్యాంశాలను ప్రసారం చేయనున్నారు.ఇప్పటికే పాఠ్యాంశాల రికార్డింగ్‌ చేయిస్తున్న టీశాట్‌ అధికారులు, నోటిఫికేషన్‌ విడుదలైన నాలుగు రోజుల్లోనే శిక్షణను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తంగా అన్ని రకాల పోటీ పరీక్షల కోసం టీశాట్‌ 1500 గంటల సమయం ఉన్న వీడియోరికార్డులను సిద్ధం చేసింది.అభ్యర్థులు కోరుకుంటే డిజిటల్‌ ప్రశ్నపత్రాన్ని వారి మెయిల్‌ ఐడీకి పంపిస్తారు. ఇందుకోసం టీశాట్‌ అన్ని సబ్జెక్ట్‌లకు కలిపి 50వేల ప్రశ్నలను సిద్ధంగా ఉంచింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments