Sunday, November 24, 2024
Homeక్రైమ్ఈతకు వెళ్లిన బాలుడు మృతి

ఈతకు వెళ్లిన బాలుడు మృతి

17న మృతుడి సోదరి పెళ్లి
రేగొండ మండలం రేపాకలో విషాదం
స్పాట్ వాయిస్, రేగొండ: స్నేహితులతో కలిసి ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు బావిలో మునిగి మృతి చెందాడు. ఈ విషాద ఘటన రేగొండ మండలం రేపాక గ్రామంలో చోటు చేసుకుంది. సోమవారం రేపాక గ్రామానికి చెందిన సిద్ధ వినోద- సదయ్య దంపతుల కుమారుడు సిద్ధ గణేష్ (17) స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని ఊర చెరువు దగ్గర ఉన్న వ్యవసాయ బావిలో ఈత నేర్చుకునేందుకు వెళ్లాడు. తాడు సహాయంతో ఒక క్యాన్ ను కట్టుకొని బావిలోకి దిగి ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు తాడుతో బావిలో మునిగి పోయాడు. అక్కడే ఉన్న రైతులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈతకు వెళ్లిన మిగతావారు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి గ్రామస్తులు చేరుకొని పోలీసులకు సమాచారం చేరవేశారు. సంఘటనా స్థలానికి రేగొండ రెండో ఎస్సై శ్రీలత వెళ్లి విచారణ చేపట్టారు. బావిలో నీళ్లు ఎక్కువగా ఉండడంతో మోటార్ల సాయంతో నీరు తోడుతున్నారు. ఇంకా మృతదేహాన్ని బయటకు తీయలేదు. కాగా ఈ నెల 17న మృతుడి సోదరి వివాహం ఉండడంతో ఆ కుటుంబంతోపాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments