పార్టీ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడుతున్నారని చర్యలు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కీలక నేతలను సస్పెండ్ చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చర్యలు తీసకున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ అధిష్టానం వేటు వేసింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారని సస్పెండ్ చేశారు. కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సీఎం కేసీఆర్ టార్గెట్ ఇద్దరు నాయకులు విమర్శలు చేశారు. కొంతకాలంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు. తురచూ కేసీఆర్ ప్రభుత్వ పరిపాలనపై పొంగులేటి విమర్శలు చేస్తున్నారు. కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి జూపల్లి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అయితే ఈ ఇద్దరు నాయకులు ఇప్పటి వరకూ బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదు. ఆదివారం ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పొంగులేటి, జూపల్లిపై అధిష్టానం వేటు వేసింది.
Recent Comments