ఉత్తర్వులు జారీ చేసిన డీసీవో నీరజ
స్పాట్ వాయిస్, ఆత్మకూరు: హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ను సస్పెండ్ అయ్యారు. వ్యవసాయ సహకార సంఘంలో అవినీతి అక్రమాలపై విచారణ జరిపిన అధికారులు నిజమేనని తేల్చారు. ఈమేరకు చైర్మన్ ఎరుకొండ రవీందర్ సస్పెండ్ చేస్తూ డీసీవో నీరజ ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల నుంచి సొసైటీ చైర్మన్ ఎరుకొండ రవీంద్ర డబ్బులు ఇటీవల సొసైటీ డైరెక్టర్లు నత్తి సుధాకర్, రేవూరి జైపాల్ రెడ్డితో పాటు పలువురు డైరెక్టర్లు వివరాలతో డీసీఒకు ఫిర్యాదు చేశారు. విచారణలో అవినీతి అక్రమాలు నిజమని తేలడంతో చైర్మన్ ను సస్పెండ్ చేస్తూ డీసీవో ఉత్తర్వులు జారీ చేశారు. ఆరు నెలలు పదవి కాలం ముందు చైర్మన్ సస్పెండ్ కావడంతో వైస్ చైర్మన్ జనగాం ప్రభాకర్ గౌడ్ ను ఇన్చార్జ్ చైర్మన్ గా నియమిస్తూ జిల్లా కో ఆపరేటివ్ సహకార సంఘం అధికారి నీరజ ఉత్తర్వులను జారీ చేశారు.
ఆత్మకూరు వ్యవసాయ సహకారం సంఘం చైర్మన్ సస్పెన్షన్..
RELATED ARTICLES
Recent Comments