Friday, September 20, 2024
Homeక్రైమ్సీఐ సహా ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్...

సీఐ సహా ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్…

సీఐ సహా ఇద్దరు ఎస్సైల సస్పెన్షన్…

ఉత్తర్వులు జారీ చేసిన సీపీ 

స్పాట్ వాయిస్, క్రైమ్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుగొండ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఆర్.వెంకటేశ్వర్లు, దామెర ఎస్సై ఎ.హరిప్రియ, సుబేదారి ఎస్సై పి.పున్నం చందర్ ను సస్పెండ్ చేస్తూ సీపి ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీచేశారు.ఇన్ స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు, ఎస్సై హరిప్రియ కొద్ది రోజులుగా హద్దులు మీరి వ్యవహరిస్తున్నట్టు ఎస్సై భర్త ఫిర్యాదు చేయడంతో విచారణ అనంతరం సీపీ… సీఐ ఆర్.వెంకటేశ్వర్లు, ఎస్సై హరిప్రియను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.మరో ఘటనలో సుబేదారిలో నివాసం వుంటున్న ఓ యువతి కొద్ది రోజులుగా లైంగిక వేధింపులకు గురికావడంతో రక్షణ కోసం ఎస్సై పి.పున్నంచందర్ ను ఆశ్రయించగా ఆయన నిందితుడిపై కేసు నమోదు చేయకుండా రాజీపడాల్సిందిగా బాధితురాలికి సూచినట్లుగా వచ్చిన ఫిర్యాదుపై ఎస్సైని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments