Saturday, April 5, 2025
Homeక్రైమ్అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

అనుమానాస్పదస్థితిలో మహిళ మృతి

స్పాట్ వాయిస్ ,మల్హర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలంలోని రుద్రారం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం బహిర్భూమి కోసం వెళ్లిన సానుగు రమ(46) గ్రామ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని శవమై కనిపించింది. వివరాల్లోకి వెళ్తే.. మృతురాలు కుమారుడైన విజయ్ బయటికని వెళ్లిన తన తల్లి క‌నించకపోవడంతో సమీప బంధువులకు ఫోన్ చేసి ఆరా తీశారు. వారు తమకు తెలియదని చెప్పడంతో విజయ్ మంగళవారం కొయ్యుర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం తల్లి ఆచూకీ కోసం బుధవారం వెతుకుతుండగా గ్రామం సమీపంలో ఉన్న అడవిలో చెట్టుకు ఉరి వేసుకుని క‌నిపించింది. విష‌యం తెలియ‌డంతో గ్రామస్తులు అందరూ ఘటన స్థలానికి చేరుకొని కొయ్యుర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. రమ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments