Tuesday, December 3, 2024
Homeసినిమాసూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం విషమం..

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం విషమం..

స్పాట్ వాయిస్, హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కాంటినెంటల్ వైద్యులు వెల్లడించారు. కృష్ణను వెంటిలేటర్‌పై ఉంచామని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 24 గంటల దాటితే తప్పా ఏమీ చెప్పలేమని ప్రకటించారు. కృష్ణకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కృష్ణను అర్ధరాత్రి అపస్మారక స్థితిలో ఆస్పత్రికి తీసుకొచ్చారని చెప్పారు. తీవ్ర గుండెపోటుతో వచ్చిన కృష్ణకు సీపీఆర్‌ చేశామన్నారు. కార్డియాక్‌ అరెస్టుకు పలు కారణాలు ఉంటాయని, ప్రస్తుతం అత్యంత క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. శరీరం సహకరిస్తుందా..? లేదా అనేది ఊహించి చెప్పలేమని, రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు మరోసారి హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేస్తామని కాంటినెంటల్ వైద్యులు స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments