వడదెబ్బతో గీత కార్మికుడి మృతి
గణపురంలో విషాదం
స్పాట్ వాయిస్, గణపురం : వడదెబ్బతో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మార్క రాజు (38) వృత్తిలో భాగంగా ఆదివారం తాడిచెట్టు ఎక్కడానికి వెళ్లాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన రాజు ఇంటి వరండాల్లో కూర్చుని నోరు ఎండిపోతోందని, ఆయాసం వస్తోందని భార్య సంధ్యకు చెప్పి ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో రాజును ప్రైవేట్ అంబులెన్స్ లో ములుగు సివిల్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అప్పటికే రాజు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అయితే ఎండలో ఇంటికి వచ్చిన భర్త వడదెబ్బకు గురై మృతి చెందడంతో భార్య సంధ్య కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా రాజు అకాల మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Recent Comments