సైకాలజిస్ట్ కళ్యాణి
స్పాట్ వాయిస్, హన్మకొండ: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఆదివారం హన్మకొండ నగరంలోని సుబేదారి, ప్రకాశ్ రెడ్డి పేటలో సైకాలజిస్ట్ కళ్యాణి దొమ్మేటి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. నేటి యువత చిన్నచిన్న విషయాలకు మనోవేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. దీనివల్ల తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుతోందని చెప్పారు. యువత బంగారు భవిష్యత్ మధ్యలోనే ఆవిరై పోతోందని చెప్పారు. ఆత్మహత్యలు నివారించవచ్చవచ్చని, సమస్యలు చిన్నవి లేదా పెద్దవి అయిన తల్లిదండ్రులు, స్నేహితులతో పంచుకుంటే పరిష్కార మార్గం దొరుకుతుందని చెప్పారు. ఇంకా ఏమైనా మానసిక సమస్యలు ఉంటే సైకాలజిస్ట్ లను సంప్రదించాలని సూచించారు
ఈ కార్యక్రమంలో కాలనీలో యువత, మహిళలు పాల్గొన్నారు.
ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు..
RELATED ARTICLES
Recent Comments